ప్రజాశక్తి - విశాఖ జిల్లా : కె,కోటపాడు, గోండుపాలెం ఎం యస్ యం ఇ కు పార్క్ కోసం ప్రభుత్వం చేపడుతున్న బలవంతపు భూసేకరణ తక్షణమే ఆపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న, మండల కార్యదర్శి రొంగలి ముత్యాలునాయుడు, సిఐటియు మండల కార్యదర్శి ఇర్లే నాయుడుబాబు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు ఇస్తూ స్టేటస్ కో ఇచ్చిందని, ఈ ఉత్తర్వులను తహశీల్దార్ నుండి జిల్లా కలెక్టర్ వరకు రెవెన్యూ అదికారులు అందరు తూచ తప్ప కుండా అమలు చేయాలని వారు కోరారు. హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో కాపీని మంగళవారం మీడియాకు చూపారు. అనంతరం వారు మాట్లాడారు. ‘‘ రిట్ పిటిషన్ నెం 25961/2026 తేదీ:10 సెప్టెంబర్ 2026 న న్యాయ మూర్తి: శ్రీ జస్టిస్ సుబ్బా రెడ్డి సత్తి , పిటిషనర్లు: వంటాకు దాలమ్మ మరో 20 మంది’’ . ఎం యస్ ఎం ఇ పార్క్ కు రాష్ట్ర ప్రభుత్వం మే 25 న భూమి పూజ నిర్వహించి బల వంతంగా భూసేకరణ చేస్తుందని, 2013 భూ సేకరణ కు లోబడి పబ్లిక్ హీరింగ్ గ్రామ సభ లేగోషసన్ జరప కుండా భూములు సేకరిస్తున్నారంటు హైకోర్టును అశ్రయించినట్లు తెలిపారు. దీంతో గోండుపాలెం లో సర్వే నంబర్లు 381-9, 381-15, 381-14, 381-12, 106, 380-10, 381-7, 381-4, 381-6, 381-10, 380-5, 381-2, 380-9, 380-4, 380-7, 380-8, 381-24, 381-29, 380-89, 381-13, 381-20 ల లో ఉన్న భూములు చట్ట ప్రకారం ఎలాంటి నోటీసు ఇవ్వ కుండా రైతులను ఖాళీ చేయించ డానికి వీలు లెదని కోర్టు స్పష్టం చేసిందన్నారు. మధ్యంతర ఉత్తర్వులను పాటించకుండా పైన పేర్కొన్న సర్వే నంబర్లు లోని భూము ల్లోకి రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకో కూడదని కూడా కోర్టు ఆదేశిం చిందని తెలిపారు. 2013 భూ సేకరణ చట్ట ప్రకారం రైతుల ఆమోదం లేకుండా బల వంతంగా భూములు తీసు కోవడం చట్ట విరు ద్దమని అన్నారు. ఎన్నో సంవత్స రాలుగా రైతుల భూములను నమ్ముకుని, ఆ భూమ్మీద ఆధార పడి బ్రతు కుతున్నారని, ఇప్పుడు బల వంతంగా భూములు తీసు కుంటే రైతులు, రైతు కూలీలు రోడ్డున పడతారని అన్నారు. ప్రభుత్వం 2006 లో రైతులకు పట్టాలు ఇచ్చారని, అప్పటి నుండి ఆభూముల్లోనే వాళ్ళు వ్యవసాయం చేసుకుని బతుకు తున్నారని అన్నారు. ఇప్పుడు బల వంతంగా భూమి ఇచ్చేయ్య మని రైతులపై రెవెన్యూ అదికారులు దౌర్జన్యం చేసి, బడాబాబులకు భూములు కట్ట బెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. దీనిపై భవిష్యత్తు లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రైతుల నుంచి భూములు తీసు కోవద్దని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని వారు కోరారు. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి భూ సేకరణలో తోందర పాటు నిర్ణయాలు తీసుకు న్నారని, భూములు తీసుకునే ముందుగా సంబంధిత రైతులతో మాట్లాడటం, 2013 భూసే కరణ చట్టంకు లోబడి రైతులను ఒప్పించి, భూసేకరణ చేయాలని అన్నారు. ఈ విధంగా జరగకపోవడంతో రైతులు కోర్టును అశ్రయించారని అన్నారు. ఇప్పటి కైనా దీన్ని గుణపాఠంగా తీసు కోని మిగి లిన ప్రాంతాల్లో భూసేకరణ చేసేటపుడు తగు జాగ్రత్తలు తీసు కోవాలని వారు స్పష్టం చేశారు.
మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం గోండుపాలెంలో భూసేకరణ ఆపాలి : సిపిఎం
23 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 15, 2026, 01:17 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)