హైదరాబాద్ : ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పాత్రలో రష్మిక నటించనున్నట్లు మంగళవారం మేకర్స్ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఎం.ఎస్.సుబ్బలక్ష్మి జీవిత కథని తెరపైకి తీసుకురాబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ‘ఎం.ఎస్.సుబ్బులక్ష్మి అమ్మ’ పేరుతో ఈ బయోపిక్ రూపొందనుంది. సుబ్బులక్ష్మి 116వ జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ 16న ఈ బయోపిక్‌ను ప్రారంభించనున్నట్లు నిర్మాతలు తెలిపారు. చెన్నై వేదికగా గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అగ్రకథానాయకుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందించనున్నారు. మొదట ఈ పాత్ర కోసం రుక్మిణి వసంత్, సాయిపల్లవి, కీర్తి సురేష్‌లను సంప్రదించగా.. చివరిక రష్మిక ను ఎంపిక చేశారు. ఇప్పటికే లుక్ టెస్ట్ కూడా నిర్వహించినట్లు తెలిపారు.
‘ఎం.ఎస్.సుబ్బలక్ష్మి’గా రష్మిక ..
50 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 15, 2026, 12:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)