ప్రజాశక్తి-నరసాపురం : మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై నిందితుడిని నరసాపురం టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాయపేటలోని అతని నివాసం నుండి నిందితుడిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 14న వినాయక చవితి సందర్భంగా అమ్మమ్మ ఇంటికి వచ్చిన 13 ఏళ్ల బాలికను నిందితుడు అడ్డుకుని అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు అందింది. ఘటనపై పొక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచేందుకు తదుపరి చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.







కామెంట్‌లు (0)