గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విజయవాడలో జాతీయ సరస్ మేళాను ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

1 గంట క్రితం

President Droupadi Murmu inaugurated the National Saras Mela in Vijayawada
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 12:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : విజయవాడలో జాతీయ సరస్ మేళా కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ప్రారంభించారు. అనంతరం సరస్‌ మేళాలో స్టాళ్లను పరిశీలించారు. స్టాల్‌లో చీర కొనుగోలు చేసి డిజిటల్ చెల్లింపులు చేశారు. ఉత్పత్తుల ప్రత్యేకతలపై డ్వాక్రా మహిళలను అడిగి తెలుసుకున్నారు. సహజ ఉత్పత్తులు, చేనేత వస్తువులు, హ్యాండీక్రాఫ్ట్స్​లను రాష్ట్రపతి వీక్షించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్‌ నజీర్‌, సిఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్, రామ్మోహన్ పాల్గొన్నారు. మధ్యాహ్నం స్వయం సహాయ సంఘాల మహిళలతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కలిసి భోజనం చేయనున్నారు. అనంతరం రాష్ట్రపతి ఢిల్లీకి బయలుదేరనున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శనకు 650 స్టాళ్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో తొలిసారిగా జాతీయ సరస్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 'స్వయం ఎపి' బ్రాండ్ పేరుతో ఉత్పత్తులకు ప్రభుత్వం మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తుంది. నేటి నుంచి ఈ నెల 31 వరకు 14 రోజులపాటు సరస్ మేళా కార్యక్రమం ఉంటుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్