- బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఐక్య వేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాల ఐక్యవేదిక నాయకులు చోడి ఆదినారాయణ, బూర ఐశ్వర్య యాదవ్, దిమిలి పైడ్రాజు, టీవీ దుర్గారావు, మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో అనంతరామన్ కమిషన్ రిపోర్టు ప్రకారం ఏ బి సి డి రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని, లేదా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం కుల శాతాన్ని బట్టి రిజర్వేషన్ కేటాయించాలని గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐక్యవేదిక తరుపున డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ రిజర్వేషన్ పేరుతో రిజర్వేషన్లు తీసుకురావడం వలన ఒకటి రెండు కులాలు మాత్రమే లాభం పొందే పరిస్థితి ఉంటుందని తెలిపారు. మిగతా కులాలు ఓటు వేసే యంత్రాలుగా మిగిలిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఏ బి సి డి గ్రూపు ల ప్రకారం రిజర్వేషన్ అమలు చేస్తే అన్ని కులాలకు రాజకీయాల్లో వాటా దక్కుతుందని అన్నారు. రాజకీయాల్లో వాటా దక్కని కులాలు అభివృద్ధిలో వెనుకబాటుకి గురవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అనంతరామన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం ఏబిసిడి గ్రూపులో ఉన్న కులాలను అన్నింటికీ రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఆదిలక్ష్మి, ఎస్ తారకేశ్వరరావు, రామారావు మొదలగువారు పాల్గొన్నారు.






కామెంట్లు (0)