- ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మంత్రి లోకేష్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గత ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టారని మాజీముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఉద్దేశించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. తాము గడిచిన రెండున్నర ఏళ్లలోనే రూ.5వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించామని ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై జగన్ చేసిన ట్విట్‌పై శుక్రవారం లోకేష్ స్పందించారు. ఐదేళ్లూ పబ్లిసిటీ పిచ్చతో బొమ్మలకు ఇచ్చిన ప్రాధాన్యం విద్యార్థుల భవిష్యత్తుకు ఇచ్చి ఉంటే రూ.4,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మిగిలేవా అని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రతి నెలా క్రమపద్ధతిలో నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. జగన్ పెట్టిన బకాయిలు చెల్లిస్తున్న తమపై నిందలా అని ప్రశ్నించారు. తప్పుడు ప్రచారంతో నిజాలను మార్చలేరని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న జగన్ చరిత్రను చెరిపేయలేరని పేర్కొన్నారు. ఒక విద్యార్థిని ఆత్మహత్యాయత్నాన్ని కూడా స్వార్థ రాజకీయానికి వాడుకోవడం గన్‌తో పెట్టిన విద్య కదా అని తెలిపారు. సొంత బాబాయ్ హత్య నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల వరకు జగన్ అనుసరించే పద్ధతి ఒక్కటే అని, తప్పు చేసి నెపం ఇతరులపై నెట్టడం, అబద్ధాలతో తప్పించుకోవడం అని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ గురించి జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని విమర్శించారు.








కామెంట్‌లు (0)