లండన్ : బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పోరేషన్ (బిబిసి) సైతం లే ఆఫ్ లకు సిద్ధమైంది. బడ్జెట్ లో పది శాతం కోత విధించే ప్రయత్నాల్లో భాగంగా ఉద్యోగులను తొలగించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలపాయి. నాలుగో వంతు సిబ్బంది ఉన్న న్యూస్ విభాగం సహా వచ్చేవారంలో ఈ తొలగింపులు ఉండవచ్చని సమాచారం. బిబిసిలో మొత్తం 20,000 సిబ్బందిలో పది శాతం 2,000మందిని తొలగించే అవకాశం ఉన్నట్లు ఆ వర్గాలు ప్రకటించాయి. న్యూస్ విభాగంలో టెలివిజన్, వెబ్ సైట్ లు, రేడియో, యాప్ లను నిర్వహిస్తుంది. ఈ విభాగంలో కోతలు విధించడంతో పెద్ధ సంఖ్యలో ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని, ఈ ప్రకటన నిర్దిష్ట రేడియో కార్యక్రమాలపై ప్రభావం చూపవచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
ఆర్థికంగా స్థిరమైన భవిష్యత్తు కోసం కఠినమైన, ఆమోదయోగ్యం కాని నిర్ణయాలు తీసుకోవాల్సి వుందని గత నెలలో బిబిసి కొత్త డైరెక్టర్ జనరల్ మాట్ బ్రిటన్ జాతీయ మీడియాకు వెల్లడించారు. ఈ సంస్థ ఇప్పటికే ప్రయాణాలు, నియామకాలు, మేనెజ్ మెంట్ కన్సెల్టెన్సీలు, సమావేశాలు, అవార్డులు, ఈవెంట్ లపై ఖర్చును తగ్గించడంతో సహా అనేక చర్యలను అమలు చేసింది. కంటెంట్ వంటి ఇతర బృందాలు, సిబ్బంది యేతర విభాగాల నుండి ఖర్చులను సులభంగా తగ్గించుకోగలవని అన్నారు. రాబోయే రెండేళ్లలో తన వార్షిక బడ్జెట్‌లో 10 శాతం( 500 మిలియన్ పౌండ్లు -$677 మిలియన్లు) ఆదా చేయడానికి, 2,000 వరకు ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికలను బిబిసి ఏప్రిల్‌లో మొదటిసారిగా ప్రకటించింది. ఈ ప్రణాళిక అనిశ్చితిని సృష్టిస్తుందని, కానీ ఈ సవాలులో పారదర్శకంగా ఉండాలనుకుంటున్నామని బిబిసి తాత్కాలిక డైరెక్టర్ జనరల్ సిబ్బందికి పంపిన ఈమెయిల్ లో పేర్కొన్నారు.
ఈ ఏడాది మెటా, ఐకియా గ్రూప్, స్టార్ బక్స్, క్లౌడ్ ఫ్లెయిర్ లు ఉద్యోగులపై వేటు వేసిన సంగతి తెలిసిందే.









కామెంట్‌లు (0)