mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వైద్యుని ప్రిస్కిప్షన్ లేకుండా దగ్గు సిరప్ ల కొనుగోళ్లు నిషిద్ధం

2 రోజుల క్రితం

Government makes doctor’s prescription mandatory to buy all medicinal syrups
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 16, 2026, 01:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ :   వైద్యుని ప్రిస్కిప్షన్ (మందుల చీటీ) లేకుండా దగ్గు సిరప్ లను కొనుగోలు చేయడంపై కేంద్రం నిషేధం విధించింది. దగ్గు సిరప్ సహా అన్ని సిరప్ లను కొనుగోలు చేయడానికి ఇకపై వైద్యుని ప్రిస్కిప్షన్ తప్పని సరిచేస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళశారం నోటిఫికేషన్ జారీ చేసింది. సిరప్ లను వైద్యుని సూచనలు లేకుండా సిరప్ లను కొగుగోలు చేసే విధానం ఇకపై అనుమతించబడదు. `డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940' కి సంబంధించిన నిబంధనలను నిర్దేశించే డ్రగ్స్ రూల్స్ , 1945 లో చేసిన మార్పుల గురించి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. చట్టంలోని నిబంధనల నుండి మినహాయించబడిన వాటి జాబితాలో సిరప్ అనే పదాన్ని తొలగించాలని తాజా నోటిఫికేషన్ ఆదేశించింది. అయితే గతంలో దగ్గు సిరప్, లాజెంజ్ లు (హాల్స్, స్ట్రెప్సిల్స్ వంటివి), టాబ్లెట్స్ ను మినహాయించింది. డిసెంబర్ 2025లో జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్‌ను అనుసరించి ఈ సవరణ జరిగింది. ఆ నోటిఫికేషన్‌పై ప్రభుత్వం భాగస్వాములు మరియు ప్రజల నుండి అభ్యంతరాలు, సూచనలను ఆహ్వానించింది. నోటిఫికేషన్ ప్రకారం, తుది నోటిఫికేషన్ జారీ చేయడానికి ముందు ముసాయిదా నియమాలపై అందిన అన్ని వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్