శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. అక్షయ్‌ ఇంటికి బుల్లెట్‌ ప్రూఫ్‌ రక్షణ !

42 నిమిషాల క్రితం

Stir caused by gunfire in Bollywood... Bulletproof protection for Akshay's home!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 11:29 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : బాలీవుడ్‌ సినీనటుడు టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పుల ఘటన సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. ఈ పరిణామంతో పలువురు ప్రముఖుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నటీనటుల నివాసాల వద్ద పోలీసుల నిఘాను పెంచగా, మరికొందరు తమ ఇళ్ల వద్ద అదనపు భద్రతా చర్యలు చేపడుతున్నారు.


ఈ నేపథ్యంలో సినీనటుడు అక్షయ్‌ కుమార్‌ తన నివాసంలోని కిటికీలు, తలుపులకు బుల్లెట్‌ ప్రూఫ్‌ గ్లాస్‌లను ఏర్పాటు చేయిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. మరోవైపు, సల్మాన్‌ ఖాన్‌కు ఇప్పటికే వై ప్లస్‌ భద్రత కొనసాగుతుండగా, ఆయన ఇంటి వద్ద రక్షణ ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేసినట్లు సమాచారం. నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ నివాసం వద్ద కూడా అనుమానితులు రెక్కీ నిర్వహించినట్లు వార్తలు రావడంతో, ఆయన సైతం అదనపు భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇతర బాలీవుడ్‌ ప్రముఖుల భద్రతను కూడా పోలీసులు సమీక్షిస్తున్నారు.


కాగా, అక్టోబర్‌ 18న ముంబయిలోని జుహు ప్రాంతంలో టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. అయితే, ఈ దాడి వెనుక ఎవరున్నారు ? టైగర్‌ ష్రాఫే లక్ష్యమా ? లేక మరికొందరు సినీ ప్రముఖులను కూడా లక్ష్యంగా చేసుకున్నారా ? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, టైగర్‌ ష్రాఫ్‌కు గాయాలైన దృశ్యాలతో కూడిన వీడియోను ఆయన బృందం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్