శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మాజీ మంత్రి విడదల రజిని ని తోసి కింద పడేసిన ఎస్‌ఐ ప్రియాంక

39 నిమిషాల క్రితం

SI Priyanka pushed former minister Vidadala Rajini, causing her to fall.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 03:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పల్నాడు : చిలకలూరిపేటలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని నివాసం వద్ద పోలీసుల దౌర్జన్యం చేశారు. వైసిపి అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకుంటున్న నేపథ్యంలో .... రజిని ని కలవడానికి యడ్లపాడు జడ్పిటిసి అభ్యర్థి దళిత నాయకుడు పందుల బుల్లబ్బాయిని పోలీసులు నివాసం గేటు వద్దే అడ్డుకున్నారు. తన నివాసంలోకి వస్తున్న తన వాళ్లను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తూ, వారిని లోపలికి అనుమతించాలని కోరిన మాజీ మంత్రి విడదల రజిని ని చిలకలూరిపేట రూరల్ ఎస్‌ఐ ప్రియాంక గట్టిగా తోసి కింద పడేశారు. అంతటితో ఆగకుండా, మరోసారి ఆమెను తోసేందుకు ప్రయత్నించడంతో పాటు, పదునైన అంచు ఉన్న బండపైకి తోసివేసేందుకు కూడా ప్రయత్నించారు. ఒక మాజీ మంత్రి పట్ల, తన సొంత నివాసం వద్దే పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మాజీ మంత్రి ఇంట్లోనే పోలీసుల దౌర్జన్యపై వైసిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.





ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్