శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

AP - రాష్ట్రంలో ఉద్రిక్తతలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

1 గంట క్రితం

Tensions in the state.. Control room set up
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026, 03:55 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి) తీవ్రంగా స్పందించింది. ఎన్నికల నిర్వహణను మరింత పారదర్శకంగా, శాంతియుతంగా కొనసాగించేందుకు.. అభ్యర్థులు లేదా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేందుకు ఎస్‌ఇసి విజయవాడలో ప్రత్యేకంగా ఒక కంట్రోల్‌ రూమ్ ‌ను ఏర్పాటు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు, సమస్యలు లేదా ఇబ్బందులు ఉన్నా నేరుగా ఈ కంట్రోల్‌ రూమ్‌ను సంప్రదించవచ్చని ఎస్‌ఇసి వెల్లడించింది. బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులపై ఈ కంట్రోల్‌ రూమ్‌ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోనుంది. కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు 0866 - 2490023, 0866 - 2490024, 0866 - 2490025, 0866 - 2490026 కు సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్రంలో నామినేషన్ల సందర్భంగా చోటు చేసుకున్న దాడులపై ఐజీ రాజకుమారి సమీక్ష నిర్వహించారు. ఆయా జిల్లాల్లో పరిస్థితిని ఎస్పీలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు పరస్పర దాడులపై ఎన్నికల సంఘం కూడా సమాచారం తెలుసుకుంటుంది. మరోవైపు ... పల్నాడు జిల్లా మాచవరం ఎస్సీ కాలనీలో ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ పర్యటించారు.


అన్నమయ్య జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. జిల్లాలోని పుంగనూరు, రాయచోటిలో వైసిపి, టిడిపి వర్గాలు పరస్పరం ఘర్షణకు దిగాయి. ఈ క్రమంలో జరిగిన రాళ్లదాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. రాయచోటిలోని ఎస్‌ఎన్‌ కాలనీలో వాహనాలకు నిప్పంటించారు. తిరుపతిలోనూ ఉద్రిక్తత ఏర్పడింది. వైసిపి నేతలు భూమన కరుణాకర్‌రెడ్డి, భూమన అభినయ్‌రెడ్డితో పాటు పలువురు నేతలు టిడిపి కార్యకర్తలు దాడులకు దిగారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపల్‌ కార్యాలయం వద్ద కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం నుంచి వాహనాలతో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తమ్ముడు కృష్ణారెడ్డి హల్‌చల్‌ చేశారు. ఈ క్రమంలో వైసిపి, బిజెపి కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టారు.





ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్