శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తొలి రోజు నామినేషన్లు నిల్.. చివరి రెండు రోజుల్లో జోరు..

1 గంట క్రితం

Zero nominations on the first day; a surge in the final two days.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026, 03:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- 44 వార్డుల్లో ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు

- 18తో ముగియనున్న గడువు..

- చివరి రోజుల్లో పెరగనున్న హడావుడి


ప్రజాశక్తి - చీరాల (బాపట్ల) : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చీరాల మున్సిపల్ కార్యాలయంలో ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ తొలిరోజు నామినేషన్లు లేకుండానే ముగిసింది. మున్సిపల్ పరిధిలోని 44 వార్డులకు సంబంధించి ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదని అధికారులు తెలిపారు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 18వ తేదీ వరకు గడువు ఉండటంతో అభ్యర్థులు నామినేషన్‌ పత్రాల దాఖలుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తొలిరోజు నామినేషన్లు లేకపోయినా. గడువు ముగిసేందుకు మరో రెండు రోజులు మాత్రమే ఉండటంతో చివరి రోజుల్లో నామినేషన్ల దాఖలు జోరందుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా చివరి దశలో నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రానున్న రెండు రోజుల్లో మున్సిపల్ కార్యాలయం వద్ద రాజకీయ సందడి పెరిగే అవకాశం ఉంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్