సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విజయవాడ మేయర్‌, డిప్యూటి మేయర్‌, 86 మంది కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం

27 నిమిషాల క్రితం

Vijayawada Mayor, Deputy Mayor, and 86 corporators take the oath of office
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 03:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా వంగవీటి రాధాకృష్ణ, డిప్యూటీ మేయర్ గా చెన్నుపాటి క్రాంతి శ్రీ, 86 మంది కార్పొరేటర్లు సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కళావేదికలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, డాక్టర్ జి లక్ష్మీస్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గా వ్యవహరించి, కార్పొరేటర్లతో ప్రమాణస్వీకారం చేయించారు. ముందుగా మేయర్ తో పాటు 86 మంది కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించి, ఆమె చేత కూడా ప్రీసైడింగ్ ఆఫీసర్ ప్రమాణ స్వీకారం చేయించారు. డిప్యూటీ మేయర్ గా ఎన్నికైనట్లు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా క్రాంతి శ్రీ ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ ప్రక్రియ మొత్తం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగింది. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్సీలు వర్ల రామయ్య, రూహుల్లా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ ఏ రవీందర్ రావు, ఆయా విభాగాల ఉన్నతాధికారులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
01

02

03

04

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్