సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విస్సన్నపేట పంచాయతీ బరిలో సిపిఎం, ప్రజా సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా పులిబళ్ళ ఏడుకొండలు నామినేషన్

1 గంట క్రితం

Puliballa Yedukondalu files nomination as the joint candidate of the CPM and people's organizations for the Vissannapeta panchayat election.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 01:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విస్సన్నపేట (ఎన్‌టిఆర్‌) : విస్సన్నపేట గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ (సర్పంచ్) పదవికి సిపిఎం పార్టీ బలపరిచిన 'ప్రజా సంఘాల పోరాట కమిటీ' ఉమ్మడి అభ్యర్థిగా పులిబళ్ళ ఏడుకొండలు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఆయనకు సంఘీభావం తెలిపారు. నామినేషన్ అనంతరం నాయకులు పాలకుల నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విస్సన్నపేట ప్రజలు కనీస మౌలిక వసతులు లేక నరకయాతన అనుభవిస్తుంటే, గత పాలకులు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, కంపు కొడుతున్న డ్రైనేజీ వ్యవస్థ, తీవ్రమైన మంచినీటి ఎద్దడి, తరచూ వేధిస్తున్న కరెంటు కోతలతో పాటు పట్టణంలో కోతులు, వీధి కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, పట్టణ అభివృద్ధికి ఎంతో అవసరమైన కూరగాయల రైతు బజార్, బైపాస్ రోడ్డు నిర్మాణం, ఆటోనగర్ ఏర్పాటుతో పాటు రైతుల పొలాలకు చెరువుల ద్వారా సాగునీరు అందించే విషయంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. కేవలం ఎన్నికలప్పుడే హామీలు ఇచ్చి మోసం చేసే నాయకులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ ప్రజా సమస్యలన్నింటిపై నిరంతరం పోరాడుతూ, నిత్యం ప్రజల మధ్య ఉండి అండగా నిలిచే సీపీఎం బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి పులిబళ్ళ ఏడుకొండలును భారీ మెజారిటీతో గెలిపించాలని వారు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు నాగరాజు, టౌన్ కార్యదర్శి మేకల జ్ఞాన రత్నం, కమిటీ సభ్యులు ధనలక్ష్మి, పసుపులేటి కోటేశ్వరరావు, నక్క చిట్టిబాబు, ఆడుమల్లి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Puliballa Yedukondalu files nomination as the joint candidate of the CPM and people's organizations for the Vissannapeta panchayat election.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్