సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి మేయర్ అభ్యర్థిని ఓడించాలి

35 నిమిషాల క్రితం

The alliances mayoral candidate must be defeated in the Kakinada Corporation elections
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 03:07 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

50వ వార్డు నుంచి సీపీఎం అభ్యర్థి దనాల ధనలక్ష్మిని గెలిపించాలి

నగర ప్రజలకు సీపీఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు విజ్ఞప్తి


ప్రజాశక్తి-కాకినాడ : నవంబర్ 26న జరగనున్న కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో అధికార కూటమి మేయర్ అభ్యర్థిని ఓడించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం సుందరయ్య భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఉపాధి, మహిళలకు నెలవారీ ఆర్థిక సహాయం వంటి హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చినప్పటికీ వాటి అమలులో జాప్యం జరుగుతోందని విమర్శించారు. బియ్యంతో పాటు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయని, పట్టణ స్థానిక సంస్థలకు తగిన నిధులు కేటాయించకుండా ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని ఆరోపించారు.


మరోవైపు అభివృద్ధి పేరుతో విలువైన భూములు, సహజ వనరులను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని విమర్శించారు. బీజేపీతో పొత్తు ద్వారా మతసామరస్యానికి విఘాతం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార కూటమి మేయర్ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరారు.


సీపీఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు మాట్లాడుతూ కాకినాడ స్మార్ట్ సిటీగా గుర్తింపు పొందినప్పటికీ నగరంలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదన్నారు. స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులు శివారు ప్రాంతాలు, సామాన్య ప్రజలు నివసించే కాలనీలకు పూర్తిస్థాయిలో చేరలేదని పేర్కొన్నారు. 50వ వార్డు సీపీఎం అభ్యర్థి దనాల ధనలక్ష్మికి సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్పొరేషన్‌లో సామాన్య ప్రజల సమస్యలను ప్రస్తావించే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.


ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు దువ్వ శేషబాబ్జి, కె.ఎస్. శ్రీనివాస్, జి. ప్రభాకర వర్మ, చెక్కా రమణి, అభ్యర్థి దనాల ధనలక్ష్మి, నగర కమిటీ సభ్యులు కె. నాగజ్యోతి, మలక వెంకటరమణ, నాగాబత్తుల సూర్యనారాయణ, మేడిశెట్టి వెంకటరమణ, సిహెచ్. వేణు, కె. సత్తిరాజు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్