mh ad
శనివారం, 27 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అమెరికా-ఇరాన్‌ శాంతి ఒప్పందానికి విఘాతం

2 గంటల క్రితం

attack
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 07:33 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఇరాన్‌ క్షిపణి స్థావరాలపై అమెరికా బాంబుల వర్షం

టెహ్రన్‌: అమెరికా-ఇరాన్‌ల మధ్య ఇటీవల కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందంపై మరోసారి అనిశ్చితి నీడలు కమ్ముకున్నాయి. వ్యూహాత్మక హర్మూజ్‌ జలసంధిలో ప్రయాణిస్తున్న ఒక అంతర్జాతీయ కార్గో షిప్‌ (ఎవర్‌ లవ్లీ)పై ఇరాన్‌ డ్రోన్‌ దాడికి తెగబడటంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ దాడిని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా ఖండించారు. ఇరాన్‌ తమ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని, శాంతి అవగాహనను "మూర్ఖంగా ఉల్లంఘించిందని" ఆయన ధ్వజమెత్తారు. వాణిజ్య నౌకలపై ఇలాంటి దాడులను సహించేది లేదని స్పష్టం చేశారు. దీనికి ప్రతీకారంగా అమెరికా సైన్యం (సెంట్రల్ కమాండ్) ఇరాన్‌పై ఎదురుదాడికి దిగింది. హర్మూజ్ జలసంధి సమీపంలో, క్విష్మ్ ద్వీపంలోని ఇరాన్‌కు చెందిన క్షిపణి, డ్రోన్‌ నిల్వ కేంద్రాలు, కోస్టల్ రాడార్‌ స్థావరాలే లక్ష్యంగా అమెరికా యుద్ధ విమానాలు శక్తివంతమైన వైమానిక దాడులు జరిపాయి. ఈ పరిణామంతో ఈ ప్రాంతంలో నౌకల రాకపోకలను సురక్షితంగా పునరుద్ధరించేందుకు ఐక్యరాజ్యసమితి చేపట్టిన ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్