ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

సిజెపి సంచలనం - 10 గంటలు, 120 మిలియన్ వ్యూస్, 10 మిలియన్ లైక్స్ అండ్ కౌంటింగ్ !

1 గంట క్రితం

CJP Sensation – 10 hours, 120 million views, 10 million likes, and counting!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 12:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : యువత నేతృత్వంలోని 'కాక్రోచ్ జనతా పార్టీ' (సిజెపి) సృష్టించిన సెలబ్రేషన్ రీల్ ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 10 గంటల్లోనే 120 మిలియన్ల (12 కోట్లు) వ్యూస్ దాటి డిజిటల్ మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈనాటి డిజిటల్ యుగంలో రాజకీయ సందేశాలు, ప్రజా ఉద్యమాలు ప్రజల్లోకి ఎంత వేగంగా దూసుకెళ్తున్నాయో నిరూపించేలా ఒక ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో యువత నేతృత్వంలోని 'కాక్రోచ్ జనతా పార్టీ' (సిజెపి) తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక సెలబ్రేషన్ రీల్ సోషల్ మీడియాలో రికార్డుల వేట ప్రారంభించింది. వీడియో పోస్ట్ చేసిన కేవలం 10 గంటల వ్యవధిలోనే ఏకంగా 120 మిలియన్లకు (12 కోట్లు) పైగా వ్యూస్ దక్కించుకోవడమే కాకుండా, దాదాపు కోటి (10 మిలియన్లు) లైకులను రాబట్టి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై సంచలనం సృష్టిస్తోంది. యువతతో నేరుగా అనుసంధానమవ్వడానికి, తమ గళాన్ని బలంగా వినిపించడానికి కాక్రోచ్ జనతా పార్టీ ప్రధానంగా ఇన్‌స్టాగ్రామ్‌నే వేదికగా ఎంచుకుంది. ఈ తాజా గణాంకాలు సోషల్ మీడియాలో ఆ పార్టీకి రోజురోజుకూ పెరుగుతున్న ప్రజాదరణకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.





ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్