మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏడవ రాష్ట్ర ఆర్థిక సంఘం పదవీకాలం పొడిగింపు : తమిళనాడు ప్రభుత్వం

26 జులై, 2026

TN Secretariat
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 12:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చెన్నై : తమిళనాడు ప్రభుత్వం ఏడవ రాష్ట్ర ఆర్థిక సంఘం పదవీకాలాన్ని నాలుగు నెలల పాటు పొడిగించింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సంఘం పదవీకాలం 2026 ఆగస్టు31తో ముగియాల్సి వుండగా డిసెంబర్‌ 31వరకు పొడిగించింది. గ్రామ పంచాయతీలు, పంచాయతీ యూనియన్ కౌన్సిళ్లు, జిల్లా పంచాయతీలు, పట్టణ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయడానికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చే నిధుల పంపిణీపై తగిన సిఫార్సులు చేయడానికి, మాజీ ఐఎఎస్‌ అధికారి కె. అల్లావుద్దీన్ అధ్యక్షతన 2025 మేలో ఏడవ రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటైన సంగతి తెలిసిందే. 2027 ఏప్రిల్‌1 నుండి ప్రారంభమయ్యే ఐదేళ్ల కాలానికి సంబంధించిన నివేదికను ఆగస్టు 31 నాటికి సమర్పించాల్సి వుండగా, గడువు పొడిగింపు కారణంగా కమిషన్‌ ఈ నివేదికను డిసెంబర్‌ 31నాటికి సమర్పించాల్సి వుంటుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్