బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిరియా మాజీ అధ్యక్ష‍ుడు బషర్‌ అల్‌ అసద్‌కు మరణశిక్ష‍

11 ఆగస్టు, 2026

Bashar al-Assad
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 11, 2026, 09:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​డమాస్కస్‌ : సిరియా మాజీ అధ్యక్ష‍ుడు బషర్‌ అల్‌ అసద్‌కు ఆ దేశ కోర్టు మంగళవారం మరణ శిక్ష‍ విధించింది. ఇదే కేసులో ఆయన సోదరుడు మహేర్ అసద్‌, బందువు అతేఫ్‌ ‌నజీబ్‌‌కు కూడా మరణ శిక్ష విధించింది. 14ఏళ్లపాటు సిరియాలో కొనసాగించిన హత్యలు, హింస, నియంతృత్వ అరెస్టులు సహా పలు కేసుల్లో ఆయనను నిందితుడిగా కోర్టు నిర్థారించింది. ఆయన గైర్హాజరైనా ఈ శిక్ష‍ను ఖరారు చేయడం గమనార్హం. రెబల్స్‌ తిరుగుబాటుతో ఆయన 2024 డిసెంబర్‌లో పదవీచ్యుతుడయ్యారు. అయితే సిరియానుండి పారిపోయిన ఆయన ప్రస్తుతం రష్యాలో ఉన్నట్లు సమాచారం. తన తండ్రి హఫెజ్‌ మరణించిన తర్వాత 2000లో సిరియా అధ్యక్ష‍ుడిగా అసద్‌ బాధ్యతలు చేపట్టారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్