గుంటూరు : గుంటూరు జిల్లాలోని తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో రేపల్లె ప్యాసింజర్ కు పెను ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని గుంటూరు మార్గం నార్త్ సైడ్‌లో మెయిన్ విద్యుత్ వైర్ తెగి ఎలక్ట్రిక్ రాడ్ విరిగి రైలుపై పడింది. విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీంతో తెనాలి రైల్వే స్టేషన్‌కు ఔటర్‌లో గుంటూరు- రేపల్లె రైలును అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. రైలు దిగి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కున్నారు. విషయం తెలిసిన వెంటనే రైల్వే అధికారులు, సిబ్బంది అక్కడకు చేరుకుని మరమ్మతు పనులు చేపట్టారు. తెగిన వైర్లను సరి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వీలైనంత త్వరగా విద్యుత్ వైర్లను సరిచేసి రైళ్ల రాకపోకలను పునరుద్దరిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. అయితే విద్యుత్ వైర్లు తెగిపోయినప్పటికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
రేపల్లె ప్యాసింజర్ కి తప్పిన పెను ప్రమాదం
56 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 10:48 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)