mh ad
శనివారం, 27 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆంధ్రప్రదేశ్‌కు ‘ఎల్లో అలర్ట్’..

2 గంటల క్రితం

rains
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 11:04 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • రాబోయే మూడు రోజులు ఏలూరు నుంచి ప్రకాశం వరకు భారీ వర్షాలు!

ప్రజాశక్తి-విజయవాడ : బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ఆవర్తనం, కోస్తాంధ్ర నుంచి మహారాష్ట్ర వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు జోరందుకోనున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. రానున్న రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ముప్పు ఉండటంతో అధికారులు 'ఎల్లో అలర్ట్' జారీ చేశారు. ప్రస్తుతం కోస్తాంధ్ర నుంచి తెలంగాణ మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. అలాగే ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాన్ ఆవర్తనం కొనసాగుతోంది. ఈ రెండు వాతావరణ వ్యవస్థల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాల తీవ్రత పెరిగే అవకాశముందని వాతావరణ నిపుణులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్