mh ad
శనివారం, 27 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తొలి వరల్డ్‌కప్‌లోనే చిన్న దేశం చరిత్ర -"గెలవకుండానే నాకౌట్‌లోకి కాబో వెర్డె"

1 గంట క్రితం

A small nation makes history in its debut World Cup — "Cape Verde reaches the knockout stage without winning a match."
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 12:16 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

క్రీడలు : ఫిఫా ప్రపంచకప్‌ 2026లో చిన్న దేశమైన కాబో వెర్డె అరుదైన ఘనత సాధించింది. కేవలం 5.30 లక్షల జనాభా మాత్రమే ఉన్న ఈ దేశం తొలిసారి వరల్డ్‌కప్‌లో పాల్గొని నాకౌట్‌ దశకు చేరుకుంది. విశేషమేమిటంటే .... గ్రూప్‌ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఒక్కదాంట్లో కూడా విజయం సాధించకపోయినా, మూడు డ్రాలతో రౌండ్‌ ఆఫ్‌ 32లో చోటు దక్కించుకుంది.


గ్రూప్‌–Hలో స్పెయిన్‌, ఉరుగ్వే, సౌదీ అరేబియాలతో కలిసి పోటీపడిన కాబో వెర్డె మూడు మ్యాచులను సమంగా ముగించింది. మరోవైపు స్పెయిన్‌ రెండు విజయాలు, ఒక డ్రాతో గ్రూప్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో స్పెయిన్‌తో పాటు కాబో వెర్డె కూడా నాకౌట్‌కు అర్హత సాధించింది. ఇక నాకౌట్‌ దశలో కాబో వెర్డె బలమైన అర్జెంటీనాతో తలపడనుంది. ఇదే గ్రూప్‌లో స్పెయిన్‌ చేతిలో 1-0తో ఓడిన ఉరుగ్వే టోర్నీ నుంచి నిష్క్రమించగా, సౌదీ అరేబియా కూడా ఇంటిముఖం పట్టింది.


ఫ్రాన్స్‌కు వరుసగా మూడో విజయం.. డెంబెలె హ్యాట్రిక్‌తో నార్వేపై ఘన విజయం ....

గ్రూప్‌–Iలో ఫ్రాన్స్‌ తన అద్భుత ఫామ్‌ను కొనసాగించింది. నార్వేతో జరిగిన మ్యాచ్‌లో 4-1 తేడాతో ఘన విజయం సాధించి వరుసగా మూడో గెలుపును నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో స్టార్‌ ఫార్వర్డ్‌ Ousmane Dembélé హ్యాట్రిక్‌ గోల్స్‌తో మ్యాచ్‌ హీరోగా నిలిచాడు.


ఆట ప్రారంభమైన ఏడో నిమిషంలోనే తొలి గోల్‌ చేసిన డెంబెలె, 20వ నిమిషంలో మరోసారి గోల్‌ చేసి ఫ్రాన్స్‌కు 2-0 ఆధిక్యం అందించాడు. 21వ నిమిషంలో నార్వే తరఫున అస్గార్డ్‌ ఒక గోల్‌ చేసి స్కోరును 2-1కు తగ్గించినా, 32వ నిమిషంలో డెంబెలె తన మూడో గోల్‌తో హ్యాట్రిక్‌ పూర్తి చేసి ఫ్రాన్స్‌ను మరింత బలమైన స్థితిలో నిలిపాడు. అదనపు సమయంలో (90+4) డిసైర్‌ డౌయ్‌ మరో గోల్‌ చేయడంతో ఫ్రాన్స్‌ 4-1తో విజయం ఖరారు చేసుకుంది. ఇదే గ్రూప్‌లో సెనెగల్‌ 5-0 తేడాతో ఇరాక్‌ను చిత్తు చేసింది. దీంతో గ్రూప్‌–I నుంచి ఫ్రాన్స్‌, నార్వే, సెనెగల్‌ జట్లు నాకౌట్‌ దశకు అర్హత సాధించాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్