శ్రీనగర్ : 1996 నాటి కేసులో వేర్పాటువాద సంస్థ ‘ హురియత్ కాన్ఫరెన్స్’కి చెందిన ఆరుగురు నేతలపై జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఐఎ) శుక్రవారం చార్జిషీట్ నమోదు చేసింది. వీరిలో ముగ్గురు ఇప్పటికే మరణించారు. 1996లో శ్రీనగర్‌లో మూకదాడి, పోలీసు సిబ్బందిపై విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడిన కేసుల్లో చార్జిషీటు నమోదు చేసినట్లు తెలిపింది. డెమోక్రటిక్ ఫ్రీడమ్ పార్టీ చీఫ్ షాబిర్ అహ్మద్ షా, తెహ్రీక్ హురియత్ నేత సయ్యద్ అలీ షా గిలానీ, జెకె పీపుల్స్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు అబ్దుల్ గనీ లోన్, జెకె లిబరేషన్ ఫ్రంట్ నేత జావిద్ అహ్మద్ మీర్, ఇస్లామిక్ స్టూడెంట్స్ లీగ్ చైర్మన్ షకీల్ అహ్మద్ బక్షీ, మొహమ్మద్ యాకూబ్ వకీల్‌ల పేర్లను చేర్చినట్లు వెల్లడించింది. నేరపూరిత కుట్ర, హత్యాయత్నం, అల్లర్లు, ప్రభుత్వోద్యోగులపై దాడికి సంబంధించి రణబీర్ పీనల్ కోడ్ (1989)లోని సంబంధిత నిబంధనలు, అలాగే చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (1967)లోని సెక్షన్ 13 కింద ఆరుగురు వేర్పాటువాద నేతలపై అభియోగాలు మోపినట్లు తెలిపింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఏప్రిల్ 2026లో ఈ కేసును తమ పరిధిలోకి తీసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని ఎన్‌ఐఎ పేర్కొంది.
1996 నాటి కేసులో ఆరుగురు వేర్పాటు వాద నేతలపై చార్జిషీట్
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 10, 2026, 06:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)