- సినిమా హిస్టరీలోనే గొప్ప ప్రయోగం.. : మంత్రి దుర్గేష్
అమరావతి: ప్రముఖ యూట్యూబర్, క్రియేటివ్ డైరెక్టర్ స్టైల్ రవి తెరకెక్కిస్తున్న వినూత్న ఓటీటీ చిత్రం 'గ్రహాంతర ప్రేమికుడు'. సినీ చరిత్రలోనే ఒక మైండ్‌బ్లోయింగ్ ప్రయోగంగా రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్‌ను రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం వెలగపూడి సచివాలయంలో ఘనంగా విడుదల చేశారు."విశ్వంలో ఏలియన్స్ ఉనికిపై ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో ప్రజలను ఆలోచింపజేసే కథాంశంతో వస్తున్న 'గ్రహాంతర ప్రేమికుడు' ఒక అద్భుత ప్రయోగం. ఏలియన్స్‌తో మానవాళికి ముప్పా? మేలా? అనే పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇలాంటి కొత్త కంటెంట్‌తో వచ్చే దర్శకులకు, ఏపీలో సినిమా తీసే ప్రతి ఒక్కరికీ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది" అని చిత్ర యూనిట్‌ని మంత్రి దుర్గేష్ అభినందించారు.దర్శకులు దిలీప్ రాజా ఆధ్వర్యంలో చిత్ర యూనిట్ ఈ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా దర్శకులు దిలీప్ రాజా ఆధ్వర్యంలో ఈ చిత్ర యూనిట్ మంత్రి దుర్గేష్ ను కలిశారు. త్వరలోనే ఈ చిత్రం నేరుగా ఓటీటీ స్క్రీన్స్‌పైకి వచ్చి థ్రిల్ చేయనుందన్నారు.
"భూమి ట్రాన్సిట్ జోన్‌లో 1,715 నక్షత్రాలు ఉన్నాయనే సైంటిఫిక్ రీసెర్చ్ ఆధారంగా ఈ కథను సిద్ధం చేశాం. విశ్వకాంతి వేగంతో ఏలియన్స్ ప్రయాణించే విజువల్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), హై-ఎండ్ విజువల్ ఎఫెక్ట్స్, టాప్ నాచ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ సాయంతో అంతర్జాతీయ సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం." అని సినిమాపై ఉన్న నమ్మకాన్ని దర్శకుడు స్టైల్ రవి వ్యక్తపరిచారు.ఈ చిత్రంలో భవానీ కపూర్, రమ్య రాథోడ్, సముద్రాల శ్రీధర్ శర్మ, రమేష్ వర్మ, వారణాసి పాత్రుడు, యశ్వంత్ చంద్ర, మల్లెపాడు రమేష్, సైదులు తదితరులు నటిస్తున్నారు. నిర్మాతగా ఎలిజబెత్ (కెనడా) వ్యవహరించగా డీవోపీ ప్రకాష్ జైన్ (రాజస్థాన్), ఎడిటర్ ఆండ్రు అలెక్సా, ఏఐ కంపోజర్ బెంజమిన్ వియర్, కంప్యూటర్ గ్రాఫిక్స్ ను అలెక్సా తెరకెక్కించారు.







కామెంట్‌లు (0)