శుక్రవారం, 10 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నరసాపురం నుంచి బెంగళూరు వెళ్లే రైలు ప్రారంభం

2 గంటల క్రితం

minister
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 10, 2026, 05:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి

ప్రజాశక్తి - పాలకొల్లు : నరసాపురం నుంచి బెంగళూరు వెళ్లే 17293 ఎక్స్ప్రెస్ రైలు ను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పాలకొల్లులో జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు, టిడిపి, జనసేన నేతలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంతవరకు నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు 2 రైళ్లు మారుతూ ఇబ్బంది పడేవారని చెప్పారు. ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా నేరుగా బెంగళూరు వెళ్ళవచ్చు అని చెప్పారు. మరిన్ని రైళ్లు ప్రవేశ పెడతామని మంత్రి చెప్పారు.వైజాగ్ కు రాత్రి సమయంలో వెళ్లే రైలు త్వరలో పునరుద్ధరణ చేస్తామని చెప్పారు. రైల్వే గేట్ వద్ద అండర్ పాస్ నిర్మాణంకు త్వరలో అనుమతి వస్తుందని చెప్పారు

రైల్వే గేట్ ప్రక్కన ఉన్న రోడ్ తెరిచేందుకు రైల్వే అధికారులతో మాట్లాడతానని మంత్రి చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో రైల్వే సభ్యులు జక్కంపూడి కుమార్, విద్యార్థులు, చాంబర్స్ అధ్యక్షులు కారుమూరి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్