కారకాస్ : వెనిజులా భూకంప మృతుల సంఖ్య పెరిగింది. సుమారు 164మంది మరణించినట్లు తాత్కాలిక అధ్యక్షురాలు రోడ్రిగ్జ్ గురువారం జాతీయ ప్రసంగంలో పేర్కొన్నారు. 971మంది గాయపడ్డారని అన్నారు. పునర్‌నిర్మాణాల కోసం 200 మిలియన్ డాలర్ల ప్రారంభ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వెనిజులాలో గురువారం ఉదయం వరుసగా రెండు సార్లు భారీ తీవ్రతతో భూకంపాలు వచ్చిన సంగతి తెలిసిందే. లాగువైరా, డిస్ట్రిటో క్యాపిటల్, మిరాండా రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ రెండు భూకంపాల మధ్య 101 ప్రకంపనలు వచ్చాయని రోడ్రిగ్జ్ వెల్లడించారు.
164కు చేరిన వెనిజులా భూకంప మృతుల సంఖ్య
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 25, 2026, 04:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)