mh ad
ఆదివారం, 21 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కార్పొరేట్ల లూటీని అరికట్టే దమ్ము పవన్ కు వుందా?

4 గంటల క్రితం

vsr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 21, 2026, 07:31 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ఆయన శాఖలు పని చేయకా ప్రజలకు శాపంగా మారాయి

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తాను హోమ్ మంత్రి అయి ఉంటె తాటా తీస్తానని చెబుతున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందు తన శాఖల ద్వారా కార్పొరేట్ లూటీని అరికట్టాలని సిపిఎం రాష్ర్ట కార్యదర్శి వి శ్రీనివాసరావు సూచించారు. విజయవాడలోని బాలోత్సవ భవన్‌‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ కేంద్రకమిటీ సభ్యులు డి రమాదేవి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ ‌బాబూరావులతో కలిసి ఆదివారం మాట్లాడారు. హెట్రో డ్రగ్స్ కాలుష్యం వల్ల రాజయ్యపేట దగ్గర సముద్రంలో టన్నుల కొద్ది చేపలు మృత్యువాత పడ్డాయని శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ హెట్రో డ్రగ్ కాలుష్యాన్ని అరికట్టేందుకు పర్యావరణ శాఖ మంత్రిగా ఏం చేస్తున్నారని పవన్‌ను ప్రశ్నించారు. విశాఖపట్నంలో అదానీ గూగుల్ డేటా సెంటర్ వల్ల వాతావరణం వేడేక్కుతుందని ప్రతి ఒక్కరూ నేడు అంగీకరిస్తున్నారని అయినా పర్యావరణ శాఖ నిద్ర పోతున్నదా? అని ప్రశ్నించారు. అమెరికా ప్రజలు తిరస్కరించిన గూగుల్ డేటా సెంటర్‌కు విశాఖలో ఏర్పాటు చేసేందుకు ఆమోద ముద్ర వేస్తే పర్యావరణ మంత్రిగా ఏం చేస్తున్నారని అడిగారు. వీరిని అడ్డుకునే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని లూటీ చేసే కార్పొరేట్లను ఏం చేసే దమ్ము లేదన్నారు. ప్రపంచమంతా పర్యావరణంపై కొట్టుకుంటున్నాయని అలాంటి కీలకమైన శాఖను ఉంచుకుని ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏజెన్సీల్లో పంప్‌స్టోరేజ్ పేరుతో అదానీ కంపెనీ అక్రమంగా సర్వేలు చేస్తూ అడవులను నాశనం చేస్తుంటే అటవీశాఖ మంత్రిగా నిద్ర పోతున్నారా అని నిలదీశారు. అకమ్రంగా ఏజెన్సీల్లో సర్వేలు చేస్తున్న అదానీ కంపెనీ తాట తీయండని చెప్పారు. ఏజెన్సీలో డోలీలు లేకుండా చేస్తామని చెప్పినా ఇప్పటివరకు రోడ్లు కూడా వేయలేదని , ఫీడర్ అంబులెన్సులు కూడా లేవన్నారు. మీ శాఖల్లో పని సామర్థ్యం పెంచి దాని ద్వారా ప్రజలకు మేలు చేసి కార్పొరేట్ల తాట తీయండని డిమాండ్ చేశారు.

సాయికృష్ణ సంఘటనపై సమగ్ర విచారణ: బాబూరావు

విజయవాడలో సాయికృష్ణను పోలీసులు అక్రమంగా నిర్బంధించి పోలీసులే కొట్టి చంపారనే అంశంపై తూతుమంత్రంగా కాకుండా సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నేరాలు చేసే వారిని శిక్షిస్తే ఏవరికీ అభ్యంతరం లేదని తెలిపారు. చట్ట ప్రకారం విచారణ జరిపి, సాక్ష్యాలు రుజువు చేసి శిక్ష పడేలా చేయాలని కోరారు. కానీ పోలీసులు, ప్రభుత్వమే చట్టాన్ని చేతుల్లో తీసుకొని నేరాలు చేసేవారిని కాపాడి తాము కోర్టులాగా శిక్షలు వేసి చంపేస్తామంటే ఏవరూ హర్షించరని తెలిపారు. పోలీసులపై పోలీసుల విచారణ జరిగితే న్యాయం జరుగుతుందా అని ప్రశ్నించారు. ఉన్నత స్థాయి న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వాన్ని కోరతామన్నారు. సాయికృష్ణ సంఘటన, క్రాంతికుమార్ ఆత్మహత్యలపై పోలీసులపై వచ్చిన ఆరోపణలపై ఉన్నత స్థాయి న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్