ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘12 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. యోగా గురు బాబా రాందేవ్ తో కలిసి ముఖ్యమంత్రి యోగాసనాలు చేశారు. తదనంతరం వ్యసన ముక్త్ భారత ప్రచార యాత్ర వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస వర్మ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర మంత్రులు సత్య కుమార్ యాదవ్, కందుల దుర్గేష్, అచ్చెన్నాయుడు, సవిత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణ రాజు, ఉన్నతాధికారులు సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్, చక్రధర్ బాబు, జి.లక్ష్మీశ పాల్గొన్నారు.
వ్యసన ముక్త్ భారత్ వాహనాన్ని ప్రారంభించిన సిఎం
21 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 21, 2026, 08:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)