ముంబయి : బంధన్ మ్యూచువల్ ఫండ్ నిఫ్టీ కమోడిటీస్ ఇండెక్స్ ఆధారిత ఓపెన్ ఎండెడ్ ఫండ్‌ను ప్రారంభించింది. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 3 వరకు న్యూ ఫండ్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. చమురు, గ్యాస్, లోహాలు, మైనింగ్, విద్యుత్, నిర్మాణ సామగ్రి, రసాయన రంగాల్లోని కంపెనీలపై ఈ ఫండ్ పెట్టుబడులు పెట్టనుంది. మౌలిక సదుపాయాలు, తయారీ, ఇంధనం, కృత్రిమ మేధస్సు, డేటా సెంటర్ల విస్తరణ కమోడిటీల డిమాండ్‌ను పెంచే అవకాశముందని బంధన్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ విశాల్ కపూర్ పేర్కొన్నారు.
బంధన్ ఎంఎఫ్ నుంచి కమోడిటీస్ ఇండెక్స్ ఫండ్
53 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 23, 2026, 09:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)