గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దసరా పండుగ వేళ గ్యాస్ ధరలు పెంపు..

1 గంట క్రితం

gas
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 08:06 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- కమర్షియల్ సిలిండర్‌పై రూ.62.50 భారం

న్యూఢిల్లీ: దసరా పండుగ సీజన్‌కు ముందు దేశంలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. 19 కిలోల వాణిజ్య వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.62.50 పెంచడంతో, న్యూఢిల్లీలో దీని ధర రూ.2,810కి చేరింది. వరుసగా రెండో నెల కూడా కమర్షియల్ ఎల్పీజీ ధరలు పెరగడం గమనార్హం. దసరా పండుగకు ముందు వచ్చిన ఈ ధరల పెంపు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, చిన్న ఆహార తయారీ యూనిట్లపై ప్రభావం చూపనుంది. పెరిగిన ఇంధన వ్యయాల కారణంగా వ్యాపార నిర్వహణ ఖర్చులు పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రభావం ఆహార పదార్థాల ధరలపైనా పడే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. అయితే గృహ వినియోగానికి ఉపయోగించే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్