బుధవారం, 28 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition మారుతీ లాభాల్లో 26 శాతం పతనం

17 గంటల క్రితం

26% drop in Maruti's profits
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026, 08:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా విక్రయాలు పెరిగినప్పటికీ నికర లాభం భారీగా పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 సెప్టెంబర్‌‌తో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 26.4 శాతం క్షీణించి రూ.2,466.1 కోట్లకు పరిమితమైంది. ఇదే సమయంలో 6,96,654 వాహనాలను విక్రయించడంతో కార్యకలాపాల ఆదాయం 26 శాతం పెరిగి రూ.53,355 కోట్లకు చేరింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ముడిసరుకుల వ్యయాలు పెరగడం, పెట్టుబడులపై నష్టాలు నమోదు కావడం లాభదాయకతను దెబ్బతీశాయని కంపెనీ వెల్లడించింది. అమ్మకాలు, ఆదాయంలో వృద్ధి నమోదైనప్పటికీ వ్యయాల ఒత్తిడితో లాభాలు తగ్గడం గమనార్హం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్