బుధవారం, 28 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Markets - భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

1 గంట క్రితం

Markets - Stock markets in deep losses
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 28, 2026, 12:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ముడిచమురు ధరల పెరుగుదల, అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం


బిజినెస్ : అంతర్జాతీయ పరిణామాలు దేశీయ స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల, అమెరికా బాండ్ ఈల్డ్స్ అధికం కావడంతో బుధవారం మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. ఉదయం 10.50 గంటల సమయానికి సెన్సెక్స్ 900 పాయింట్ల వరకు పడిపోగా, నిఫ్టీ 190 పాయింట్లు నష్టపోయింది.


ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా వంటి ఐటీ షేర్లు 2 నుంచి 4 శాతం వరకు పడిపోయాయి. నిఫ్టీ ఐటీ సూచీ మూడు శాతానికి పైగా నష్టపోగా, మార్కెట్ అస్థిరతను సూచించే ఇండియా విక్స్ నాలుగు శాతం పెరిగి 17 స్థాయిని దాటింది.


బ్రెంట్ ముడిచమురు ధర బ్యారెల్‌కు 115 డాలర్లకు చేరడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయంపై అనిశ్చితి మార్కెట్లపై ఒత్తిడి పెంచాయి. విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కూడా ఆందోళన కలిగిస్తోంది. ముడిచమురు ధరలు తగ్గి, విదేశీ పెట్టుబడిదారులు మళ్లీ కొనుగోళ్లు ప్రారంభిస్తే మార్కెట్లు కోలుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్