శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబాల్య జ్ఞాపకాలు

5 రోజుల క్రితం

బాల్య జ్ఞాపకాలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 03:55 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

గోరుముద్దలు తినిపించే

అమ్మ చందమామ కథలు!

నవ్వుల పువ్వులు పూయించే

మేనమామ హాస్య చతురోక్తులు!

​

హాయిగా నిద్రపుచ్చే

నాయనమ్మ జోల పాటలు!

పండగంత సందడి తెచ్చే

తాతయ్య తిప్పిన తిరునాళ్ళు!

​

ఆటపాటలతో అలరించే

అన్నాచెల్లెళ్ళు, స్నేహితులు!

భవిష్యత్తుకు దారిచూపే

నాన్న చూపుడు వేలు!

​

వెనుదిరిగి చూసుకుంటే

వెంట నడిచే బతుకు చిత్రాలు!

ఎప్పటికీ పదిలపరుచుకో

బాల్య మధుర జ్ఞాపకాలు!!

​- తిప్పాన హరి రెడ్డి

9493832412

విజయవాడ


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్