మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ నటి కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ‘దాయిరా’ ఓటీటీలోకి రానుంది. నవంబరు 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. 2019లో హైదరాబాద్‌లో జరిగిన దిశ అత్యాచార ఘటన, ఎన్‌కౌంటర్ నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకురాలు మేఘనా గుల్జార్ తెరకెక్కించారు. ఇందులో పృథ్వీరాజ్ పోలీసు అధికారిగా నటించారు. సెప్టెంబరు 18న హిందీ, మలయాళ భాషల్లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రాన్ని జంగ్లీ పిక్చర్స్, పెన్ స్టూడియోస్ పతాకాలపై వినీత్ జైన్, ధవల్ జైన్, ధవల్ గడా నిర్మించారు.
13 నుంచి ఓటీటీలో ‘దాయిరా’
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 07, 2026, 08:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)