శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘రామాయణం’ విజువల్‌ ఎఫెక్ట్స్‌ అద్భుతం

1 గంట క్రితం

‘రామాయణం’ విజువల్‌ ఎఫెక్ట్స్‌ అద్భుతం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026, 08:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రణబీర్‌ కపూర్‌ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్‌ రావణుడిగా నటించిన ‘రామాయణం పార్ట్‌-1’ నవంబరు 5న విడుదలైంది. ఈ చిత్రంలోని విజువల్‌ ఎఫెక్ట్స్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. భారీ స్థాయిలో రూపొందించిన దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయని అగ్ర దర్శకుడు రాజమౌళి, నటుడు మహేశ్‌బాబు సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసించారు. రణబీర్‌, యశ్‌, సాయిపల్లవి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. విడుదలకు ముందు ఏ.ఆర్‌. రెహమాన్‌ సంగీతంపై విమర్శలు చేసినవారు సైతం సినిమా చూశాక పాటలు, సంగీతాన్ని మెచ్చుకుంటున్నారు. నమిత్‌ మల్హోత్రా, యశ్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సుమారు రూ.4 వేల కోట్ల వ్యయం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్‌ దర్శకుడు నితీశ్‌ తివారీ తెరకెక్కించిన ఈ చిత్రానికి రెండో భాగం కూడా సిద్ధమవుతోంది. ‘రామాయణం పార్ట్‌-2’ను 2028 దీపావళికి విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్