సెలవులు ముగిసి,
బడులు తెరుచు వేళ,
పిల్లలకు ఎంత సంతోషమో,
కొత్త పుస్తకాల వాసన చూడొచ్చని!
తల్లిదండ్రులకు ఎంత వరమో,
పిల్లలకు అక్షరాలతో పాటు
అన్నమూ దొరుకుతుందని!
అంగడి వారికి ఎంత ఆనందమో,
వ్యాపారం రెట్టింపు అవుతుందని!
బడి తోటకు ఎంత వగలో,
పిల్లలు సీతాకోకచిలుకలవుతారని!
బడిగంటకు ఎంత కులుకో,
మూగనోము వీడొచ్చని!
గురువులకు ఎంత ముచ్చటో,
పిల్లలు పై తరగతులకు వచ్చారని!
బడికి ఎంత పరవశమో,
ఇక ప్రతి రోజూ పండుగ సందడేనని!
– సురేంద్ర రొడ్డ,
94915 23570.








కామెంట్‌లు (0)