కొత్త విషయాలు నేర్చుకోవడం,
కొత్త సంగతులు తెలుసుకోవడం,
రోజుకో కొత్త పాఠం చదవడం,
నాకెంతో ఇష్టం… ఎంతో ఇష్టం!
పుస్తకాలతో స్నేహం చేస్తా,
ప్రశ్నలెన్నో అడుగుతుంటా,
ఆటపాటలతో నేర్చుకుంటూ,
ఆనందంగా ముందుకెళ్తా!
చదువులోనైనా, ఆటల్లోనైనా,
కొత్తదనం వెతుకుతుంటా,
చిన్న చిన్న అడుగులు వేస్తూ,
చక్కని లక్ష్యాలు చేరుకుంటా!
నేర్చుకోవడమే నా ఆనందం,
జ్ఞానాన్ని పెంచుకోవడమే నా లక్ష్యం!
పెంటమరాజు ధృవిత
2వ తరగతి, డాన్‌బాస్కో స్కూలు,
గుంటుపల్లి, ఎన్టీఆర్ జిల్లా.







కామెంట్‌లు (0)