ఆదివారం, 08 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవెలుగుల దీపావళి..

16 నిమిషాల క్రితం

59ce17d16d7f6c4f5faf6413575073fc.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026, 08:24 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

చీకట్లను పారద్రోలే చైతన్య వెలుగుల దీపావళి

ఆకలి బతుకుల్లో ఆనందాలు వెల్లివిరిసే కాంతావళి

ధరల మంటల్లో సతమతమయ్యే

బడుగు బతుకుల్లో అమావాస్య నాడు

వెన్నెల వెలుగులు వికసించే రోజు

నిరాశా నిస్పృహల జీవితాల్లో

ఆశల వెలుగులు పంచే అమృతావళి!

అవినీతి నరకాసురల చీకట్లను పారదోలే జ్ఞానజ్యోతి,

అసమానతల అగాధాలను రూపుమాపే ప్రేమజ్యోతి

మత విద్వేషాల అగ్నికీలలను ఆర్పే మానవత్వం,

విశ్వాన్ని ఆవరించిన యుద్ధ మేఘాలను చెదరగొట్టే శాంతితత్త్వం!

ప్రతి పేదింటా చిరునవ్వుల వెలుగు విరియాలి,

ప్రతి మనసూ సమతామమతల క్రాంతి దీపమై వెలగాలి


రేపాక రఘునందన్


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్