ఆదివారం, 08 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఇళ్లన్నీ కాంతులతో

10 నిమిషాల క్రితం

Happy-Deepavali-2024-CN.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026, 08:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

దీపావళి వస్తుంది

ఆనందాలను తెస్తుంది

వీధులన్నీ వెలుగులతో నిండిపోతాయి

ఇళ్లన్నీ కాంతులతో కళ కళ లాడతాయి

కానీ ....ఎవరికీ కనబడని కొన్ని మనసులు మాత్రం

ఇంకా చీకటిలోనే మిగిలిపోతాయి

ఒక దీపం వెలిగించటానికి నూనె, వత్తి, అగ్గిపుల్ల కావాలి

మనిషి జీవితంలో వెలుగులు విరబూయటానికి

కాస్త ప్రేమ, కొంచెం పలకరింపు, కూసింత ఓదార్పు కావాలి.

మనకోసం మాత్రమే జీవిస్తే అది బతుకు

నలుగురి జీవితాల్లో వెలుగు నింపితే అది జీవితం

మన పేరు ఎంతకాలం నిలుస్తుందో తెలియదు…

మన హోదా ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు…

మన సంపద ఎంతకాలం నిలుస్తుందో అసలే తెలియదు…

కానీ .....మన వల్ల ఒకరి ముఖంలో పూసిన చిరునవ్వు,

ఒకరి కష్టంలో అందించిన చేయూత,

ఒకరి కన్నీటిని తుడిచిన ఆప్యాయత…

అవి మాత్రం మనిషి జ్ఞాపకాల్లో కలకాలం నిలిచిపోతాయి!

అందుకే ఈ దీపావళి నాడు-

ఇంటికి ఒక దీపం… మనసుకు ఒక ఆశ,

కుటుంబానికి ఒక ఆనందం… సమాజానికి ఒక భరోసా,

మనిషికి ఒక మానవత్వపు సందేశం అందిద్దాం!

ఒక్క దీపం వంద దీపాలను వెలిగించగలదు

ఒక్క మంచి ఆలోచన సమాజాన్ని మార్చగలదు

కనుక వెలిగిద్దాం దీపాలను…

విరజిమ్ముదాం ప్రేమానురాగాలను

దీపావళిగా మార్చుకుందాం

మన జీవితాన్ని ప్రతిరోజూ!

మమతల కోవెలగా చేద్దాము

మన ఇంటిని ప్రతిక్షణం

ప్రొఫెసర్‌ శాంతిశ్రీ కెవి

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్