శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపుట్ట..

4 రోజుల క్రితం

పుట్ట image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026, 04:54 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

పుట్ట పుట్ట పుట్ట

చెట్టు చేమ చెంత పుట్ట

చీమలు కష్టపడి కట్ట

పాములు తిష్ట వేసునంట!

​

నింగిని తాకే కొండలు

కొండలపై రాతి బురుజులు

నేలకు బారెడత్తు పుట్టలు

చీమలు నైపుణ్యానికి ఋజువులు!

​

కోటలు రాజ్య రక్షణ పొంగులు

పుట్టలు చీమల ఆహార గిడ్డంగులు

కోటలు ఆర్భాటాల చెంగులు

పుట్టలు సౌందర్యాల హంగులు!

​

కోటలు కడతారు రాజులు

పుట్టలు కడతాయి చీమలు

రాజుల పైసలు రాళ్లపాలు

చీమల పుట్టలు పాముల పాలు!

​

పుట్టకు పాలు పోసి

పామును పూజిస్తారు!

కొండ- కోటలు త్రవ్వి

ఎలుకను తీస్తారు...!

​

చీమలు కట్టిన పుట్టలు

రాజులు కట్టిన కోటలు

మట్టి పుట్టలు - రాతికోటలు

సాంకేతికతకు నిదర్శనాలు !

​- పట్లొళ్ళ బక్కారెడ్డి

97053 15250

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్