వానా వానా వచ్చింది
వాకిలి తడిపీ పోయింది
మొక్కలు నోళ్లు తెరిచాయి
చుక్కలు చుక్కలు పడ్డాయి
అమ్మ వద్దనీ వారించింది
తడవొద్దని హెచ్చరించింది
జలుబొస్తుందని గుర్తుచేసింది
వినలేదని గుడ్లురిమింది
గొడుగులు బైటికి తీశాము
జోరువానలోకి వెళ్లాము
కడవలు బాగా నింపాము
పడవలు చేసి ఆడాము
నాన్న బండి చప్పుడయింది
చివాలున ఇంట్లోకి
గెంతాము
తువాలుతో అమ్మ నించుంది
జుత్తును బాగా తుడిచింది
బామ్మ సాంబ్రాణి వేసింది
పకోడీలు పళ్లెంలో పెట్టింది
వేడి పాలనూ అందించింది
నాకూ చెల్లికి ఆకలి తీరింది
– చెన్నాప్రగడ శర్మ,
94405 87567.






కామెంట్‌లు (0)