శుక్రవారం, 24 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌లో రాజీపడే ప్రసక్తే లేదు : చర్చల అనంతరం సిజెపి

1 గంట క్రితం

cjp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 03:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌లో రాజీపడే ప్రసక్తే లేదని కేంద్రమంత్రులకు స్పష్టం చేశామని సిజెపి పేర్కొంది. కేంద్రమంత్రులు శుక్రవారం సిజెపి ప్రతినిధులతో చర్చలు జరిపారు. సిజెపి డిమాండ్‌ మేరకు ‘కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా’లోని విఠల్‌భాయ్‌ పటేల్‌ హౌస్‌లో చర్చలు చేపట్టారు. సిజెపి తరపున ఆ పార్టీ ప్రధాన ప్రతినిధి సౌరవ్‌ దాస్‌, జాతీయ ప్రతినిధి అశుతోష్ రాంకాలు పాల్గొనగా, కేంద్ర ఆరోగ్య మంత్రి జె.పి.నడ్డా, ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి (పిఎంఒ) జితేంద్ర సింగ్ ప్రభుత్వం తరఫున పాల్గొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలన్న తమ డిమాండ్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రులకు స్పష్టం చేశామని సమావేశం అనంతరం సిజెపి ప్రతినిధి సౌరవ్‌ దాస్‌ తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ. కోటి పరిహారం చెల్లించాలని, అలాగే నిరసనకారులపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశామని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్రం ఒక రోజు సమయం కోరినట్లు వారు తెలిపారు. మరో రెండు డిమాండ్లపై సానుకూలంగా స్పందించిందని అన్నారు. సిజెపితో మరోసారి సమావేశం కానున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి జె.పి.నడ్డా మీడియాకు వెల్లడించారు. తదుపరి చర్చల కోసం శనివారం మరోసారి సిజెపి ప్రతినిధులతో సమావేశం కానున్నామని అన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్