శుక్రవారం, 24 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition ఆదర్శంగా ఉండాలి

1 గంట క్రితం

katha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 25, 2026, 03:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఒక అందమైన ఉదయం మేఘాలు సూర్యుడిని ఇలా అడిగాయి. ‘మీరు ప్రతిరోజూ ఇంత సమయపాలనతో, క్రమశిక్షణగా ఎందుకు ఉంటారు?’ అది విన్న పర్వతాలు చిరునవ్వు నవ్వి మౌనంగా ఉన్నాయి. ఆకాశం మాత్రం సూర్యుడి సమాధానం కోసం ఆసక్తిగా ఎదురుచూసింది. సూర్యుడు చిరునవ్వుతో అడిగాడు. ‘నన్ను మీరు పెద్దవాడిగా భావిస్తున్నారా?’ అప్పుడు మేఘాలు ఇలా జవాబిచ్చాయి. ‘అవును. ఈ విశ్వంలో కొన్నింటిని మినహాయిస్తే, మీరు మాకందరికంటే పెద్దవారే.’ ఆ సమాధానం విని సూర్యుడు ఇలా అన్నాడు. ‘అందుకే నేను ప్రతిరోజూ సమయానికి వస్తాను. కుటుంబంలోనైనా, సంస్థలోనైనా, పరిశ్రమలోనైనా, కంపెనీలోనైనా, ఈ విశ్వంలోనైనా పెద్దవారి మొదటి బాధ్యత సమయపాలన పాటించడం, చిన్నవారికి ఆదర్శంగా నిలవడం. పెద్దలు మాటలతో కాదు, తమ ప్రవర్తనతోనే మార్గనిర్దేశం చేయాలి.’ ఈ సందేశాన్ని విన్న మేఘాలు ఎంతో సంతోషించాయి.

నీతి: పెద్దవారు మాటలతో కాదు, ఆదర్శప్రాయమైన ప్రవర్తనతోనే చిన్నవారికి మార్గదర్శకులవుతారు.

– ఎం.వి. స్వామి,

94415 71505.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్