శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వాన రావాలి...

30 అక్టోబర్, 2026

వాన రావాలి.. image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026, 03:58 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

వానా వానా రావాలి

వాగులు వంకలు దొర్లాలి

చెరువులు ఎక్కి పారాలి

నదులు పొంగి పొర్లాలి

​

మట్టి సువాసన రావాలి

ఎండిన నెర్రెలు పూడాలి

పుడమితల్లి పులకించాలి

ఆశల మోసులు లేయాలి

​

పంటలు పచ్చగ పండాలి

పొలాల గట్లు మురవాలి

నాగలి పట్టి దున్నాలి

పైరులు ఏపుగ పెరగాలి

​

ధాన్యపు గాదెలు నిండాలి

రైతుల ముఖము నవ్వాలి

ఎండిన కొమ్మలు చిగురించాలి

అడవి పచ్చని చీరా కట్టాలి

​

కోయిల కమ్మగ పాడాలి

నెమలి నాట్యమాడాలి

జీవుల దాహం తీరాలి

చిటపట చినుకులు కురవాలి

​

ఇంద్రధనుస్సు విరియాలి

చిన్నారి చిందులు వేయాలి

కాగిత పడవలు వదలాలి

అమ్మ తిట్లతో తడవాలి

- డా. ఆవుల చక్రపాణి యాదవ్,

99633 50973

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్