వర్షం..సన్న జల్లుతో ప్రారంభమై
డమడమ ఉరుములతో వస్తుంది
పెళ పెళ మెరుపులతో వాతావరణాన్ని మార్చేస్తుంది
అసలు వర్షం అంటే ఎవరికి ఇష్టం ఉండదు
అందరూ వర్షాన్ని ఇష్టపడే వాళ్ళం
ఎప్పుడు వర్షం పడుతుందా అని ఆలోచిస్తారు
ఎందుకంటే వర్షం రైతులకు ఉపయోగం
మనం బతకడానికి అన్నం కావాలి
అన్నం తయారీ కావాలంటే పంటలు కావాలి
పంటలు బాగా పండాలంటే దానికి వర్షం కావాలి
అందుకే మాకు వర్షం అంటే ఇష్టం !

జి. రామ్ తేజ రెడ్డి,
8వ తరగతి,
అరవింద హై స్కూల్ కుంచనపల్లి, గుంటూరు జిల్లా.








కామెంట్‌లు (0)