శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవిక్రముడు – విజయుడు

5 రోజుల క్రితం

విక్రముడు – విజయుడు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 04:26 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

​మహారాజు కుమారుడు

విక్రముడను యువరాజు

తెలివి తేటలే కాదు

ధైర్యమున్న మొనగాడు.

రాజ్యములో ఎవరికైనా

కష్టమన్న ముందుండును

వారి వారి సమస్యలను

తీర్చే మనసున్న వాడు

ఒకరోజున నగరములో

కలకలములు రేగినవి

అందమైన యువతులంతా

మాయమగుట జరిగినది

రాజ్యం కల్లోల మాయె

ప్రజలంతా భీతిల్లె

మాయావి ఎవరనేది

ఎవ్వరికి తెలియదాయె!

యువరాజు ముందుకొచ్చి

ఖడ్గమును చేతబట్టే

తలితండ్రుల దీవెనతో

యువతుల రక్షింప వెడలె..


యువరాజు స్నేహితుడు

మహామంత్రి కుమారుడు

వీరోచిత పోరాటంలో

విక్రమునికి సమానుడు

తోడుగా నే నుంటానని

ముందుకొచ్చే విజయుడు

ఇద్దరు బయలుదేర

ప్రజలంతా సంతసించె

అశ్వాలను అదిల్చారు

తూర్పువైపు కదిలారు

కొండగుట్ట లెక్కినారు

అడవంతా తిరిగారు

మాయావి జాడ తెలీక

అలసి సొలసిపోయారు

ఓ మామిడి చెట్టు కింద

విశ్రాంతికై పరుండారు

పాపం యువరాజని

పక్షులు మాట్లాడినవి

పక్షి భాష తెలిసిన

విజయుడు విన్నాడది

యువరాజుకు ప్రమాదం

ముంచుకొచ్చే ఈ దినం

మాయావి చేతిలో

మరణమింక తధ్యము

ఆ మాటలు విన్న విజయ

ఆశ్చర్యపోయినాడు

తప్పించుకొను దారి లేదా

అని పక్షుల నడిగినాడు

తమ భాషలో మాట్లాడిన

యువకుని వంక చూసి

లేకేమి మంత్రి కొమర

కిటుకు చెప్పెదము వినుము


ఇక్కడికొక యోజనమున

పెద్ద మర్రి చెట్టున్నది

మర్రి తొర్ర లోన వెలిగే

బంగారపు గుడ్డున్నది

ఆ గుడ్డున నిక్షిప్తం

ఆ మాయావి ప్రాణం

అది పగిలిన వాడు చచ్చు

అదే వాడి రహస్యం

చెప్పి ఎగిరే పక్షి జంట


కర్తవ్యం తెలిసి విజయ

మర్రి వైపు కదిలినాడు

స్నేహితునికి చెప్పకుండ

మాయావి రంకె విన్న

అటుగ పోయే యువరాజు

బందీలైన యువతులు

కనులారా చూసినాడు

కత్తి దూసి యువరాజు

మాయవితో తలపడెను

మాయావి మాయలతో

యువరాజుని నిలువరించే

ఇతని గెలుచుటెట్ల అని

యువరాజు తలవసాగే

ఇంతలోన విజయుడొచ్చే

బంగారు గుడ్డు తెచ్చే

యువరాజ వాడి ప్రాణం

ఈ గుడ్డు లోన వుంది

అంటూ గుడ్డు పగలగొట్ట

మాయావి నేల కూలే

యువతుల విడిపించినారు

స్నేహితులు అనిపించినారు

ఒకరికొకరు తోడుంటే

ఎదురు లేదు అనుకున్నారు

- కూచిమంచి నాగేంద్ర

91821 27880.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్