సోమవారం, 16 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionప్రకృతి ఒడిలో మదనపల్లి ప్రయాణం

16 గంటల క్రితం

A Journey to Madanapalle in the Lap of Nature
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 01:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

దసరా హాలిడేస్‌‌లో మేము మదనపల్లికి ఒక అద్భుతమైన విహారయాత్రకు వెళ్ళాము. ఉదయం 4:20 కు రైలు ఎక్కాము; 10 గంటల ఈ ప్రయాణంలో మేము అందరం ఆటలాడుకుంటూ, పాటలు పాడుకుంటూ ఎంతో సరదాగా గడిపాము. మధ్యాహ్నం 2 గంటలకు మదనపల్లి చేరుకున్నాము._ అక్కడి నుండి బస్సులో గవికొండకు వెళ్ళాము. ఆ కొండను ఎక్కి, అక్కడ ఉన్న శివుని గుడిని దర్శించుకున్నాము. ఆ తర్వాత షిర్డీ సాయి స్కూల్ కు వెళ్ళి కాసేపు ఆడుకున్నాము._ _మరుసటి రోజు ఉదయం 8 గంటలకి ప్రముఖ రిషి వాలీ పాఠశాలను సందర్శించాము. చల్లటి ప్రకృతి వాతావరణంలో ఉన్న ఆ అందమైన పాఠశాల క్యాంపస్‌ను, అక్కడి వసతులను చూసి ఎంతో ఆనందించాము. అక్కడ మోషే సార్‌తో సమావేశం ముగిసిన తర్వాత భోజనం చేసి, హార్స్‌లీ హిల్స్‌కు వెళ్ళాము. అక్కడ సూర్యాస్తమయం వీక్షించడం ఒక అద్భుతమైన అనుభూతినిచ్చింది._ మూడవ రోజు ఉదయం అగస్త్య ఫౌండేషన్‌ను సందర్శించాము. అక్కడ బయాలజీ, సెన్సారీ రూమ్, కెమిస్ట్రీ వంటి విభాగాన్ని చూసి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాము. _చివరి రోజు ప్రకృతి వనమును సందర్శించాము. అక్కడ రైతులు పడే కష్టాన్ని, వ్యవసాయం, మొక్కల ప్రాముఖ్యతను తెలుసుకున్నాము. ఆ తర్వాత మోషే సార్‌ ఇంటికి వెళ్ళి, సాయంత్రం రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాము. ఈ సెలవుల్లో చేసిన ఈ యాత్రలో ఎన్నో_

నేర్చుకున్నాం.‌

​IMG-20261028-WA0224.jpg

ఎమ్. కృష్ణ విరాట్_

6వ తరగతి, అరవింద హైస్కూల్,

కుంచనపల్లి, గుంటూరు జిల్లా.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్