అనగనగా ఒక ఊరిలో ఒక గొర్రె ఉండేది దానికి చాలా కోపం. అది ఒక తోటకు కాపలా ఉంది. ఒకరోజు ఒక కుందేలు, గొర్రె ఉన్న తోటకు వచ్చింది. గొర్రెకు కోపం వచ్చింది. దాన్ని కొట్టడానికి కుందేలు వెనకాలే పరిగెత్తింది. కానీ కుందేలు తెలివిగా కొన్ని తాళ్లు కట్టిన చెట్టు దగ్గర నుండి వెళ్ళింది. గొర్రె చూసుకోకుండా వెళ్లి తాళ్ళకు తగిలి జారిపడింది. ఇంతలో కుందేలు అక్కడి నుండి తప్పించుకుంది. గొర్రె ఆవేశంలో అపాయంలో పడింది. అందుకే కోపం పనికిరాదు. కోపం లేని కుందేలు అపాయంలో కూడా ఉపాయంగా ఆలోచించింది.
కె. వరుణ్ శేషసాయి, 5వ తరగతి,
ది క్రాస్‌వర్డ్ స్కూల్, గుంటూరు.









కామెంట్‌లు (0)