సోమవారం, 16 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionచిట్టి ఉడుత.. చిన్నారి సిరి

15 గంటల క్రితం

కె.వి.లక్ష్మణరావు 9014659041
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 02:21 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

సిరి మూడవ తరగతి చదువుతోంది._ సిరికి_ స్కూల్ నుండి ఇంటికి రాగానే బ్యాగ్ కూడా దించకుండా పెరట్లోకి పరుగెత్తడం అలవాటు._ అక్కడ వాళ్ళ తాతయ్య_ నాటిన పెద్ద జామ చెట్టు ఉంది. ఆ జామచెట్టు కిందే సిరి సాయంత్రం తన స్నేహితులతో ఆడుకుంటుంది.. పాడుకుంటుంది. అలసిపోగానే కిందకు వంగి ఉన్న_ఒక కొమ్మ నుండి ఒక జామకాయ కోసుకుని తిని, అమ్మ ఇచ్చిన గ్లాసుడు మంచినీళ్లు తాగి లోపలికి వెళ్తుంది. ఆ జామచెట్టు మీదే ' చిట్టి' అనే ఉడుత కూడా ఉంటోంది. రోజూ సిరి నీళ్లు తాగుతున్న శబ్దం వినగానే చిట్టీకి దాహం వేసేది. మెల్లగా కిందకు దిగి వచ్చి సిరి వైపు ఆశగా చూసేది.

కానీ సిరి ఉడుతను చూడగానే, ‘ఛీ! పో! నా నీళ్లు నీకెందుకు? మీరు మాట్లాడలేరు. మాకులా ఆలోచించలేరు.’ అంటూ కోపంగా, గుడ్లురిమి చూసేది. పాపం చిట్టి_ సిరి చూపులకు భయపడిపోయి, గబగబా చెట్టు పైకి పాక్కుంటూ పోయేది. ఇది రోజూ జరిగే తంతు. ఒకరోజు మాత్రం అనుకోకుండా సాయంత్రం వర్షం బాగా కురిసింది. మరుసటి రోజు సిరి స్కూల్ నుండి వచ్చి చూస్తే, కిందకు వంగిన కొమ్మ విరిగిపోయి ఉంది. జామకాయలన్నీ చెట్టు పై కొమ్మల మీద బాగా ఎత్తులో మాత్రమే ఉన్నాయి. సిరికి చెట్టెక్కడం రాదు. స్కూల్ బ్యాగు భుజాన వేసుకునే నిలబడి, పైకి ఆశగా చూసింది. ‘అయ్యో, ఈ రోజు జామకాయ నాకు అందేలా లేదు. ఈ రోజు నేను తినలేను’ అనుకుంటూ చిన్నగా నిట్టూర్చింది. ఆమె నిరాశను పైనున్న చిట్టి_గమనించింది. రోజూ సిరి_ తన పట్ల చూసే బెదురు చూపులను పట్టించుకోలేదు._ వెంటనే ఒక్క_పరుగున చెట్టు పై కొమ్మ మీదకు వెళ్ళింది. అక్కడ బాగా పండిన ఒక పెద్ద జామకాయను తన చిన్ని పళ్లతో కొరికి,_ కిందనున్న సిరి చేతిలో పడేలా జారవిడిచింది.

జామకాయ గాలిలో తిరుగుతూ వచ్చి సరిగ్గా సిరి చేతుల్లో పడింది. సిరి ఆశ్చర్యపోయింది. చేతిలోని జామకాయను, పైనున్న ఉడుతను మార్చి మార్చి చూసింది. ‘నేను నీ దాహం తీర్చలేదు, పైగా నిన్ను ప్రతిరోజూ బెదిరించాను. అయినా నువ్వు నేను అడగకుండానే నాకు కావాల్సిన జామపండు కోసిచ్చావు’ అని అనుకుంటుండగానే సిరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.

వెంటనే ఇంట్లోకి పరిగెత్తింది. ఒక చిన్న మట్టి గిన్నెలో మంచినీళ్లు, మరో గిన్నెలో కొన్ని బియ్యపు గింజలు తీసుకుని వచ్చి చెట్టు మొదట్లో పెట్టింది.

ఉడుత మొదట భయపడింది, కానీ సిరి నవ్వుతూ ‘రా ! భయపడకు’ అనగానే, గబగబా దిగి వచ్చి నీళ్లు తాగడం మొదలుపెట్టింది. సిరి దాన్ని తన చిట్టిచేతివేళ్లతో మెల్లగా నిమిరింది.

అమ్మ వచ్చి ఇదంతా చూసి ‘ఏమైంది సిరీ?’ అని అడిగితే, సిరి ఇలా_ చెప్పింది - ‘అమ్మా, చెట్లు పరోపకారానికి ప్రతిరూపాలని తెలుగు పాఠంలో చదివాను. అందుకే పండ్లు ఇవ్వడం వాటి సహజగుణం అని తెలుసుకున్నాను. కానీ చెట్టు మీద ఉండే_ ఉడుతకు కూడా అంత మంచి గుణం, చల్లని మనసు_ఉంటుందని ఇప్పుడే తెలుసుకున్నా’ అని చిట్టి కేసి ఆప్యాయంగా చూస్తూ అంది.

‘మూగ జీవులు కూడా మనలాంటి జీవులే. పాపం మాట్లాడలేవు. కనుక వాటి అవసరాలను అంటే ఆకలి, దాహాలను కూడా వీలైనంతలో మనమే తీర్చాలి.. అర్థమైందా?’ అమ్మ సిరిని మెచ్చుకోలుగా చూస్తూ అంది. ఆ రోజు నుండి సిరి పెరట్లో రెండు గిన్నెలు ఎప్పుడూ ఉంచుతోంది. ఒకటి సిరి జామకాయలు తినడానికి, ఇంకొకటి ఉడుత దాహం తీర్చడానికి. మూగజీవులను కూడా ఆదరించాలని, అవీ జీవులేనని తెలుసుకుంది.​

కె.వి.లక్ష్మణరావు 9014659041

కె.వి.లక్ష్మణరావు

9014659041

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్