ఈ విద్యా సంవత్సరం నా స్నేహితులు, ఉపాధ్యాయులతో కలిసి ఎంతో సంతోషంగా గడిచింది. ఉపాధ్యాయుల నుండి నేను ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నాను. SA-I పరీక్షలు రాసేటప్పుడు నాకు చాలా సులభంగా అనిపించింది. పాఠశాలలో జరిగిన క్రీడా దినోత్సవం (Sports Day) నాడు ఆటలు ఆడుతూ ఎంతో ఆనందించాము. వార్షికోత్సవం రోజున నా స్నేహితులతో కలిసి నృత్యం చేశాను. ఆ రోజు మాకు ఎంతో సరదాగా గడిచింది. అలాగే ‘నో బ్యాగ్ డే’ నాడు నా స్నేహితులతో కలిసి మైండ్ గేమ్స్ ఆడుకోవడం చాలా బాగుంది. బాలల దినోత్సవాన మా ఉపాధ్యాయులు మా కోసం చేసిన డ్యాన్సులు, నాటికలు మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. ఈ విధంగా మా విద్యా సంవత్సరం ఎంతో సంతోషంగా ముగిసింది.
కె. హిమ సాయిశ్రీ
4వ తరగతి, అరవింద హైస్కూలు,
కుంచనపల్లి, గుంటూరు జిల్లా.
మధురమైన ఏడాది
5 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 14, 2026, 11:56 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)